భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారణమయ్యింది మహాత్మా గాంధీ. ఈ ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహాత్ముడు మహాత్మా గాంధీ. ఆ అస్త్రాలను వాడటానికి ఎంతో ధైర్యం కావాలి, త్యాగం చేయాలి అని నిరూపించారు. చేత కర్రబట్టి రవి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి.. వారిని తరిమి కొట్టినా, నూలు వడికినా, మురికివాడలు శుభ్రం చేసినా ఎంతో శ్రద్ధ వహించారు గాంధీ. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు గాంధీజీ. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి గాంధీ చేసిన కృషిని మాటల్లో చెప్పలేం. గాంధీ మాటలు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చేవిగా ఉండేవి. అలాంటి మహాత్ముడి గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకుందాం
ఇప్పటి తరం వాళ్లకు కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందని తెలుసు. నిజానికి గాంధీ తన 100వ జయంతి సందర్భంగా 1969లో తొలిసారిగా నోట్లపై కనిపించారు. దీనికిముందు దేవాలయాలు, ఉపగ్రహాలు, ఆనకట్టలు , గార్డెన్‌లు భారతీయ కరెన్సీ నోట్లపై కనిపించేవి. ఆర్‌బీఐ 1935లో ఏర్పడ్డాక 1938లో తొలిసారిగా ఒక రూపాయి నోటును ముద్రించింది దాని మీద కింగ్ జార్జ్ 6 చిత్రం ప్రింట్ చేసారు .. స్వతంత్రం తర్వాత ఆర్బీఐ తన మొదటి నోటును 1949లో స్వతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు ముద్రించింది. ఈ నోట్ పై అశోక చిహ్నం ముద్రించారు. మహాత్మా గాంధీ చిత్రాన్ని 1969లో భారతీయ నోట్లపై ప్రింట్ చేశారు. ఆయన 100వ జయంతిని పురస్కరించుకుని బ్యాంకు నోట్లపై ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. మన కరెన్సీ నోట్ పై కనిపించే గాంధీ బొమ్మ ఆయన నిజమైన ఫొటో! 1946లో అప్పటి వైస్రాయ్ హౌజ్ లో ఓ వ్యక్తి తీసిన ఫొటో అది.
గాంధీ దేశానికీ స్వాతంత్రం తేవడంలోనే కాదు భక్తులు కోర్కెలు తీర్చే గాంధీగా కూడా మారారు.
హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో పెద్ద కాపర్తి నే గ్రామంలో గాంధీ దేవాలయం ఒకటి కనిపిస్తుంది. ఈ గాంధీ ఆలయాన్ని రోజూ ఎంతో మంది దర్శించుకుంటారు. ఈ గుడికి 2012లో మహాత్మాగాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూమి పూజ చేయగా.. 2014, సెప్టెంబర్ 17న మహాత్మా గాంధీ పాలరాతి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. ఈ ఆలయంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రత్యేక పూజలు కూడా చేస్తారు.
సుభాష్ చంద్రబోస్ 1944లో గాంధీజీని దశపిత జాతి పితగా సంబోధించారు . 1947లో సరోజినీ నాయుడు కూడా ఇదే మాట అన్నారు. ఆ తర్వాత.. మహాత్ముడికి భారత దేశ జాతిపితగా అధికారిక గుర్తింపు వచ్చింది. గాంధీకి “మహాత్మా” అన్న బిరుదును రవింద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు. గాంధీ ఐరిష్ యాక్సెంట్లో బాగా మాట్లాడేవారు. ఆయనకు చదువు చెప్పిన మొదటి ఇంగ్లీష్ టీచర్ ఓ ఐరిష్ వ్యక్తి అయ్యేసరికి గాంధీకి ఆ యాక్సెంట్ చాల ఫ్లూయెంట్ గా వచ్చేసింది. నోబెల్ పురస్కారానికి గాంధీ పేరు ఐదు సార్లు సిఫార్సు చేసారు. కానీ ఒక్కసారి కూడా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. చివరిగా 1948లో పురస్కారానికి నామినేట్ అయ్యారు. కానీ ఆయన హత్య నేపథ్యంలో ఆ ఏడాది ఆ బహుమతిని ఎవరికీ ఇవ్వలేదు. టైమ్ మ్యాగజైన్ అందించే ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఎంతో ప్రతిష్టాత్మకమైనది అలాంటి అవార్డు 1930లో గాంధీని వరించింది. ఉప్పు సత్యాగ్రహం నేపథ్యంలో ఈ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడు గాంధీనే.
Discussion about this post