జాతిపిత మహాత్మా గాంధీ.. దేశానికి దిక్సూచి అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ చెప్పారు. మహాత్ముని వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
పీసీసీ సభ్యుడు రాయల నాగేశ్వరావు, ఐ.ఎన్.టీ.యూ.సీ. రాష్ట్ర నేత జలీల్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సత్యం, అహింసలను ఆయుధాలుగా చేసుకుని పోరాడిన మహనీయుని జీవితం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. గాంధీజీ శాంతి దూత అని అభివర్ణించారు.
Discussion about this post