యువతను టార్గెట్ చేసుకున్న మాదకద్రవ్యాల అక్రమరవాణా ముఠా, ఇప్పుడు పిల్లలను కూడా లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటివరకు హైదరాబాద్ వంటి మెట్రోనగరాల్లో మాత్రమే లభించే గంజాయి చాక్లెట్లు ప్రస్తుతం మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఖమ్మంలో గంజాయి చాక్లెట్లు దొరకడం కలకలం రేకెత్తిస్తోంది. మామూలు చాక్లెట్లకు వీటికి తేడా లేకుండా ఉండటంతో తల్లిదండ్రులు మరింత భయాందోళనలకు గురవుతున్నారు.
ఆబ్కారీ టాస్క్ ఫోర్స్ గంజాయి చాక్లెట్ల రాకెట్ గుట్టురట్టు చేసింది.
ఖమ్మం కాల్వ ఒడ్డు ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా ఇద్దరు నిందితుల వద్ద 3 కిలోల గంజాయి చాక్లెట్స్ తో పాటు 8 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న గంజాయి చాక్లెట్లలను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తి, ఔరంగాబాదుకు చెందిన ముగ్గురు మహిళలను ఆబ్కారీ బృందం సోదా చేయగా వారివద్ద 27 కిలోల గంజాయి దొరికింది. ఒడిశాలోని మల్కన్గారి, ఏపీ అటవీ ప్రాంతాల్లో గంజాయి దొరికే చోటు నుంచే చాక్లెట్లు సరఫరా అవుతున్నాయని పోలీసుల విచారణలో తేలింది. నిందితులపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
Discussion about this post