అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించిన భీమిలి ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. చీపురుపల్లిలో పోటీ చేయాలని అనేక మార్లు తనని చంద్రబాబు అడిగారన్నారు. కానీ తనకు భీమిలి నియోజకర్గం అంటే ఇష్టమని అందుకే అక్కడ నుంచి పోటీ చేశానన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానని గంటా శ్రీనివాస్ తెలిపారు.
Discussion about this post