Gavaskar Warns India: ఇంగ్లాండ్‎తో సెమీస్.. టీమిండియాకు గవాస్కర్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగిందంటే ?

Gavaskar Warns India: టీ20 ప్రపంచకప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న సెమీఫైనల్ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీమిండియాను హెచ్చరించారు.

Gavaskar Warns India: ఇంగ్లాండ్‎తో సెమీస్.. టీమిండియాకు గవాస్కర్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగిందంటే ?

Sunil Gavaskar

Gavaskar Warns India: టీ20 ప్రపంచకప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న సెమీఫైనల్ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీమిండియాను హెచ్చరించారు. ఇంగ్లాండ్ జట్టులో ఉన్న ఒక ప్రమాదకరమైన ఆటగాడి గురించి గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ రూపంలో భారత్‌కు గట్టి ముప్పు పొంచి ఉందని ఆయన విశ్లేషించారు.

ప్రస్తుత టోర్నీలో విల్ జాక్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకోవడం అతని ఆధిపత్యానికి నిదర్శనం. బ్యాటింగ్‌లో 191 పరుగులు చేయడమే కాకుండా, బౌలింగ్‌లోనూ 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. “పిచ్ గనుక కాస్త టర్న్ అయితే విల్ జాక్స్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలుగా మారుతుంది. ముఖ్యంగా సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి రైట్ హ్యాండ్ బ్యాటర్లు అతన్ని ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది” అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

ఇంగ్లాండ్ జట్టులో విల్ జాక్స్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ఆ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ అని గవాస్కర్ పేర్కొన్నారు. మన జట్టులో శివమ్ దూబే ఎలాగైతే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడో, ఇంగ్లాండ్‌కు విల్ జాక్స్ కూడా అలాగేనని ఆయన పోల్చారు. వెస్టిండీస్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ తరహాలోనే ఇంగ్లాండ్‌తో మ్యాచ్ కూడా అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుందని గవాస్కర్ జోస్యం చెప్పారు. రెండు జట్లు కూడా బ్యాటింగ్, బౌలింగ్ మరియు అనుభవంలో సమానంగా ఉన్నాయని, ఎవరు ఒత్తిడిని జయిస్తే వారే ఫైనల్ చేరుతారని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యంగా భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లైన అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబేలకు విల్ జాక్స్ బౌలింగ్ వేసే అవకాశం తక్కువని, కాబట్టి రైట్ హ్యాండ్ బ్యాటర్లే బాధ్యత తీసుకోవాలని గవాస్కర్ సూచించారు. ముంబై పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది, కానీ ఒత్తిడి ఉన్న సమయంలో స్పిన్నర్లు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి గవాస్కర్ హెచ్చరించినట్లుగా విల్ జాక్స్ భరతం పట్టి టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్తుందో లేదో చూడాలి.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top