ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తుంటే.. ఎన్నికల సమయం రాగానే వేరొకరు ఎవరో టికెట్ ఎగరేసుకుపోతే, ఎంత బాధగా ఉంటుంది. ఏపీలో పొత్తులు, వివిధ సమీకరణల అనంతరం కొంత మంది నాయకులు ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. కార్యకర్తలతో తమ గోడు వెళ్లబోసుకుంటూ బోరుమంటున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల టీడీపీ నాయకుడు గవిరెడ్డి రామానాయుడు తన అనుచరుల ముందు కంటతడి పెట్టుకున్నారు. మాడుగులలో తన అనుచరులతో రామానాయుడు సమావేశం నిర్వహించారు. తనకు సీటు దక్కకపోవడం పట్ల ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మైక్‌లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై బోరున విలపించారు.
Discussion about this post