వరంగల్ జిల్లా గీసుకొండలోని కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామివారి మహా జాతర అంగరంగ వైభవంగ కొనసాగుతుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎడ్ల బండ్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రచారం బండ్లతో లక్ష్మీనరసింహస్వామి గుడి చుట్టూ తిప్పుతూ మొక్కులు చెల్లించుకుంటారు. కళ్యాణ మహోత్సవం తర్వాత నాలుగు చక్రల రథంలో గుడి చుట్టూ ఊరేగిస్తారు. ఈ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ఉమ్మడి వరంగల్ జిల్లా భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ మొక్కులు చెల్లించుకుంటారు. కోరుకున్న కోరికలు తప్పకుండా లక్ష్మీనరసింహ స్వామి తీరుస్తారని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు.
Discussion about this post