తెలంగాణలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఇక నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీ నాయకులు, నేతలు అడుగులు వేస్తున్నారు. ఒక పార్టీపై మరో పార్టీ నాయకులు, నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ.. ప్రజలకు తాము ఏం చేయబోతున్నామో చెబుతున్నారు. ఇక తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. బీఆర్ఎస్ రేగా కాంతారావు వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ నాయకులు పార్టీ అధ్యక్షుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచి వంద రోజులు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయలేకపోతుందన్నారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ఒరిగిందేమి లేదని విమర్శించారు. ఇక రేగా కాంతారావు కామెంట్స్‌కు కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఆయన చేసిన విమర్శల్లో ఒక్కటి కూడా నిజం లేదన్నారు.
రేగా కాంతారావుకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ అని… అలాంటి పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటం తగదన్నారు. ఆయన ఇలాగే మాట్లాడితే సహించేది లేదన్నారు… కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో కట్టుకున్న పార్టీ కార్యాలయన్ని ఆయన కబ్జా చేశారని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు ఓటమి తప్పదన్నారు.
Discussion about this post