ఖమ్మం నగర పాలక సంస్థ 4వ తరగతి ఉద్యోగుల ప్రధమ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలలో నగరపాలక సంస్థ 4వ తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4వ తరగతి ఉద్యోగ సంఘం జిల్లా నేత వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ.. 146 మంది ఉద్యోగుల సమస్యలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా గత ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేర్చకుండా ఉద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Discussion about this post