నియోజకవర్గంలోని ప్రతి ఓటరు తన విజయానికి కృషి చేయాలని ఎన్డీయే కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ కోరారు….. పి. గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ తహసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. గిడ్డి స్వగ్రామం ఊడి మూడి నుంచి పి. గన్నవరానికి కాలినడకన వేలాది మందితో ర్యాలీగా వెళ్ళారు. టీడీపి, జనసేన, బీజేపి శ్రేణులు భారీ సంఖ్యలో ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే తన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Discussion about this post