ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్, కవితలపై బిజెపి ప్రభుత్వం కేసులు పెట్టిందని, దేశంలో ఒక్క బీజేపీ నాయకుని పై కేసు పెట్టిందా ? అని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. సిద్దిపేటలో జరిగిన విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తుందని మేం అలా చేయబోమన్నారు. ఢిల్లీలో నల్ల చట్టాలు తెచ్చి వందల మంది రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర బిజెపిదన్నారు. పేగులు మెడలో వేసుకోవడం రాక్షసులు చేస్తారని ప్రజలకు సుపరిపాలన అందించాలని రేవంత్ రెడ్డికి బుద్ది చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ, రైతుబంధు, వరికి బోనస్ ఇస్తే కాంగ్రెస్ కు ఓటు వేయాలని, లేకుంటే కారుకు ఓటు వేయాలని హరీష్ రావు కోరారు. బిఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో 22 ఏళ్లు ఐఏఎస్ అధికారిగా పనిచేశానని, మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.
The Impact of the Chennai Railway Accident
Chennai railway accident : ముఖ్యమైన అప్డేట్స్ Chennai railway accident లో , చాలామంది ప్రయాణికులకు తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సంఘటనలో మిసూరు-దర్బంగ సాక్షి...
Discussion about this post