అహోబిలం నరసింహ స్వామి పరువేట : అహోబిలంలో నరసింహస్వామి దేవేరి చెంచులక్ష్మి కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు నరసింహుని కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. సంక్రాంతి వరకు ఆలయంలో ఉండే స్వామివారు కనుమనాడు ఉత్సవమూర్తిగా గుడి వెలుపలకు వస్తారు. పార్వేట ఉత్సవం సందర్భంగా 46 రోజుల పాటు అహోబిలం చుట్టుపక్కల ఉన్న 33 గ్రామాల్లోని ప్రతి ఇంటిని స్వామి దర్శించుకుంటారు. ఫల్గుణ పౌర్ణమి రోజున జరిగే కళ్యాణోత్సవానికి రమ్మని ఆహ్వానిస్తాడు. ఆయా గ్రామాల శివారులోని స్వామివారి సమాధి వద్దకు చేరుకోగానే గ్రామ అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి స్వామివారికి స్వాగతం పలికారు. ఉత్సవ పల్లకి ఆగ్రామానికి వెళితే ఆ గ్రామంలో భక్తులు స్వామివారికి స్వాగతం పలికి పూజలు చేస్తారు. స్వామివారి పార్వేట ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
Discussion about this post