మూడవ సారి మోదీ ప్రధాన మంత్రి కావడం ఖాయమని, రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు గెలిచేలా కార్యకర్తలు కృషి చేయాలని బీజేపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి బీజేపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…మోదీ సభ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తక్కువ సమయంలో సభ విజయవంతానికి కృషి చేసిన కార్యకర్తలు… ఇదే తరహాలో ముందుకు సాగాలని, మోదీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని అన్నారు.
Discussion about this post