శ్రావణ శుక్రవారం కావడంతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. వరలక్ష్మీ వ్రతాలు ఆచరించే రోజు కావడంతో భక్తులు ఉదయం నుంచి తమ ఇష్ట దైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రధానంగా అమ్మవారి ఆలయాలన్నీ మహిళ భక్తులతో నిండిపోయాయి. ఈ శ్రావణ శుక్రవారం ఇంట్లో లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటే శుభప్రదమని మహిళలు భావిస్తారు. ఇంట్లోనే అమ్మవారిని పసుపుతో అలంకరించి వరలక్ష్మీ పూజలను నిర్వహిస్తారు.
ప్రత్యేక పూజలు:
కొత్త వస్త్రాలు ధరించి శ్రీమహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తే అష్టశ్వైర్యాలు, ఆయురోరగ్యం ఫలిస్తుందని నమ్ముతారు. అందుకే శ్రావణ మాసంలో మహిళలు ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు. పేద నుంచి ధనవంతుల వరకూ ఈ రోజు వరలక్ష్మీ వ్రతం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భవాస్తారు. చుట్టుపక్కల వారిని పిలిచి తాంబూలాలు అందచేస్తారు. మహిళలకు ఇది ప్రత్యేక పండగ.
Discussion about this post