పచ్చ బంగారం మళ్లీ కళకళలాడుతోంది. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో క్వింటా పసుపుకు రికార్డ్ స్థాయిలో రూ.20 వేలకు పైగా ధర రావడంపై పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో పసుపు సాగు దిగుబడి గణనీయంగా తగ్గడం వల్లే అధిక ధరలు వస్తున్నాయనే చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా పసుపు సాగు ఎక్కువగా ఉన్నా.. జిల్లాలో మాత్రం అది క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. గతంలో 50 వేల ఎకరాల్లో సాగయ్యే పసుపు ప్రస్తుతం 19 వేల ఎకరాలకి చేరింది. ధరలు ఇలా ఉంటేనే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
Discussion about this post