అకౌంట్లలోకి రూ.20 వేలు..! రైతులకు బంపర్ గుడ్ న్యూస్..! | Good News For Farmers

ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం త్వరలో “అన్నదాత సుఖీభవ” డబ్బులను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

తొలకరి పలకరించడంతో పంటలు సాగు చేసేందుకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రైతుల పెట్టుబడికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సాయాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసుకుంది. ఈ మేరకు నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. అకౌంట్లోకి ఎప్పుడు పడతాయనే విషయంపై క్లారిటీ వచ్చింది.

జూన్ నెల చివరి నాటికి అన్నదాత సుఖీభవ డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తోంది. ఈ పథకం కింద ఏడాదికి 20 వేల రూపాయల చొప్పున లబ్దిదారులకు కూటమి ప్రభుత్వం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సాయంతో కలిపి ఏపీ ప్రభుత్వం ఈ స్కీమ్ వర్తింపచేస్తోంది. పీఎం కిసాన్ సాయం ఏడాదికి 6 వేల రూపాయలు అందుతుండగా.. అన్నదాత సుఖీభవ కింద 14 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తోంది. దీంతో మొత్తం ఏడాదికి ఒక్కొ లబ్దిదారుడికి 20 వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తోంది. వీటిని రైతులు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. మొత్తం మూడు విడతలుగా రైతుల అకౌంట్లలో ఈ నగదును జమ చేస్తున్నారు. మార్చిలో ఈ స్కీమ్ కింద 7 వేల రూపాయలను రైతుల అకౌంట్లలో జమ చేశారు. ఇప్పుడు మరో విడత నగదును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.

ఇక డాక్యుమెంట్లలో తప్పులు, టెక్నికల్ కారణాల వల్ల గత విడతలో లబ్ది పొందనివారికి సవరణలు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అలాగే కొత్త దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది. సమీపంలోని రైతు సేవా కేంద్రం అధికారులను సంప్రదించి తప్పులు సరిదిద్దుకోవడం, కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడం లాంటివి చేసుకోవచ్చు. ఇక అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడాలంటే కొన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. భూమి వివరాలు ఆధార్‌తో సీడింగ్ చేసుకోవాలి. ఇక ఆధార్ కార్డు యాక్టివ్‌గా ఉండాలి. అలాగే పీఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఇక ఆధార్, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, పట్టాదార్ పాస్ బుక్‌లో ఎలాంటి తప్పులు ఉండకూడదు.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top