పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలానే ఉద్దేశ్యం తో ప్రభుత్వం సబ్సిడీ పై కందిపప్పు, ఫైన్ రైస్, రా రైస్ లను రైతు బజార్లలో అందించడం జరుగుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం రైతు బజార్లో గురువారం సబ్సిడీ పై కందిపప్పు, బియ్యాన్ని ప్రారంభించారు. సివిల్ సప్లై శాఖ రైతు బజార్లలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలానే ఆలోచనతో మార్కెట్ ధరలకంటే తక్కువ ధరలలో అందించే విధంగా కందిపప్పు, 160రూపాయలు, సోనా మసూరి రకం బియ్యం ఫైన్ రైస్ 49రూపాయలు, రా రైస్ 48రూపాయలకు అందిస్తున్నారు . నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో తెలుగుదేశం ప్రభుత్వం రైతు బజార్లలో తక్కువ ధరలలో కూరగాయలు, నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు అందించడం ద్వారా రైతులకు,వినియోగదారులై న ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.























Discussion about this post