తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పీఆర్సీతో కూడిన వేతనాలు జూన్ ఒకటో తేదీ నుంచి అమలోకి రానున్నాయి.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ… టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నామని అన్నారు. 2017లో ఆనాటి ప్రభుత్వం 16 శాతం పీఆర్సీ ఇచ్చిందని, అప్పటి నుంచి పీఆర్సీ పెరగలేదని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని చూస్తున్నామని, అందులో భాగంగానే ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. కొత్త పీఆర్సీ జూన్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందని అన్నారు.
Discussion about this post