తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని గోల్కొండ, చార్మినార్ల వద్ద పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలను సిద్దం చేసింది. చల్లని సాయంత్రాలలో టూరిజాన్ని పెంచడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో 24×7 షాపులు,రెస్టారెంట్లు ఉండేవిధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం ఆయా వ్యాపార సంస్థలు ఏడాదికి రూ. 10 వేలను ఫీజుగా చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.
రాత్రుళ్లు భోజనశాలలు, వ్యాపారాలు కొనసాగడం వల్ల ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని లేబర్ శాఖ కోరిందని అధికారులు తెలిపారు. రాత్రిళ్లు ఆల్కహాల్ అందుబాటులో ఉండటం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందేమో అని పోలీస్ శాఖ సందేహిస్తోంది. కొన్ని శాఖల అధికారులు మాత్రం ముంబై మాదిరి గా చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందంటున్నారు.
Discussion about this post