ఉద్యోగుల వయోపరిమితి కొత్త విధానంపై వచ్చిన వార్తలపై తెలంగాణ సర్కార్ స్పందించింది. ఇప్పటి వరకు అలాంటి ప్రకటనలేమి చేయలేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల పదవీ విరమణలో కొత్త నిబంధనలను తీసుకువచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగుల పదవి విరమణ 33 ఏళ్ల సర్వీస్ నిబంధన లేదా 61 ఏళ్ల వయో పరిమితిలో ఏది ముందైతే అదే అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పదవీ విరమణ నిబంధనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ ను ప్రభుత్వం కొట్టి పారేసింది.ఇదిలా ఉండగా బీఆర్ ఎస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే.
Discussion about this post