ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే గుండె, న్యూరోకు సంబంధించిన అన్ని సదుపాయాలు ఉన్నా వైద్యుడు లేక పోవడంతో ప్రస్తుతం గుండె పోటు, మెదడు వ్యాధి తోఎవరైనా ఆసుపత్రికి వచ్చారంటే ఐపీ చూసి ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. BRS ప్రభుత్వం క్రిటికల్, ట్రామా కేర్ విభాగం తయారు చేసిన తర్వాత డిప్యూటేషన్తో ఇతర జిల్లాల నుంచి వైద్యులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రులకు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల్లో డిప్యూటేషన్ ను రద్దు చేయడంతో ఖమ్మం ప్రభుత్వఆస్ప త్రిలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు వారి సొంత ప్రాంతాలకు వెళ్లారు. దీంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ కేసులకు వైద్యులు లేకపోవడంతో నిరుపేదలకు బయట ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య సేవలు పొందాలంటే భారంగా మారుతోంది. కొన్ని కేసుల్లో మాత్రం గుండె పోటుతో చనిపోయిన సంఘటనలు లేకపోలేదు.ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రుల ఉన్నా ఆసుపత్రి గురించి పట్టించు కోవటం లేదని మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెబుతున్నా ఆ దిశగా అడుగులు పడటం లేదని ఆరోపణలు వినిపిస్తు న్నాయి.
Discussion about this post