రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ‘ఈద్ ముబారక్’ చెప్పారు . ‘ రంజాన్ పండుగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అన్నారు.
అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నా’ అని వైస్సార్సీసీపీ అధినేత జగన్మోహన రెడ్డి తెలిపారు.
నెల పొడుపు చంద్రుని దర్శించిన తర్వాతి రోజున ఈద్ -ఉల్ – ఫితర్ అంటే రంజాన్ పండుగను జరుపుకొంటారు. పండుగ ప్రార్థనలను ఈద్గాలోనే జరుపుతారు. నమాజ్ అనంతరం ముస్లింలు, ముస్లిమేతరులు ఒకరినొకరు స్నేహాభావం పెంపొందించుకోవడానికి ‘అలయ్ బలయ్, ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలను తెలుపుకొంటారు. పండుగ రోజు షీర్ ఖుర్మా అనబడే మధురమైన సేమియాను వండి, ఆత్మీయులకు తినిపిస్తారు. ఆరోజు ప్రార్థనలు, విందులు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడంతో ముగుస్తుంది.
Discussion about this post