తెలంగాణ కాంగ్రెస్ : ఎన్నికల హామీల్లో భాగంగా కూనవరం గ్రామంలో గృహజ్యోతి పథకాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విద్యుత్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా బడుగు బలహీన వర్గాల కరెంటు కష్టాలు తీరుతాయని అన్నారు. పినపాక నియోజకవర్గంలో మొత్తం 27,079 మంది ఈ పథకం కింద లబ్ధి పొందారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం, ఐదు వందల రూపాయలకే గ్యాస్, ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
Discussion about this post