జూన్ 9వ తేదీన TSPSC Group 1 ఎగ్జామ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం టీఎస్పీఎస్సీ (TSPSC) పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు (Group 1 Hall Tickets) శనివారం (జూన్ 1) నుంచి అందుబాటులోకి రానున్నాయి. TSPSC Group 1 ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ TSPSC గ్రూప్ 1 అడ్మిట్ కార్డ్ 2024 డౌన్లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు వారి ID, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసిన తర్వాత వచ్చిన క్యాప్చాను ఎంటర్ చేయడం ద్వారా హాల్ టిక్కెట్లను పొందవచ్చు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మెయిన్ పరీక్షకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ పరీక్ష ద్వారా మొత్తం 536 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Discussion about this post