ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మార్వో కార్యాలయంలో చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి అభిమానంతో వేలాదిగా తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి ఆశీస్సులతో విజయం సాదిస్తానని, దెందులూరు ఎమ్మెల్యేగా మూడోసారి అసెంబ్లీలోకి అడుగుపెడతానని అన్నారు. నియోజకవర్గం అస్తవ్యస్తంగా తయారయ్యిందని, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు, త్రాగునీరు అందిస్తానని చెప్పారు.
Discussion about this post