నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపఎన్నికలలో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను..బీజేపి ఎమ్మెల్సీ అభ్యర్ధి గుజ్జుల ప్రేమందర్ రెడ్డి కోరారు. దేశం కోసం, ధర్మం కోసం యువత మొత్తం మోడీ పాలన కోరుకుంటున్నారని, పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తానని అన్నారు. గడిచిన పదేళ్ళలో బీఆర్ఎస్ పాలనలో విద్యార్ధులకు అన్యాయం జరిగిందని, మోస పూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు.
Discussion about this post