ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ భారత్‌ను వదల్లేదు. కరోనా మొదటి వేవ్, రెండవ వేవ్.. రెండింటిలోనూ ఈ వ్యాధి బారిన పడి కోలుకున్న వ్యక్తులు చాలా మందే ఉన్నారు. ఈ వ్యాధి లక్షలాది మంది ప్రజల ప్రాణాలను బలిగొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచింది. అనేక దేశాలు వ్యాధి తీవ్రతకు కొన్ని నెలల పాటు కర్ఫ్యూను ప్రకటించాయి.
భారతదేశంలో 2020 లో ప్రారంభమైన కరోనా వ్యాప్తి చాలా నెలలు కొనసాగింది. ఈ వ్యాధి తీవ్రతను తట్టుకునేందుకు, రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు టీకాలు కూడా వేయించారు. అప్పుడే పరిస్థితి అదుపులోకి వచ్చింది. కరోనా నుంచి కోలుకుని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ ప్రాణాంతక వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొత్త H5N1 బర్డ్ ఫ్లూ అంతర్జాతీయ మహమ్మారిగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఈ వ్యాధి కరోనా వ్యాప్తి కంటే 100 రెట్లు ఎక్కువ ప్రాణాంతకం అవుతుందని, మరణాల రేటు కరోనా కంటే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. H5N1 బర్డ్ ఫ్లూ క్షీరదాలలో, మానవులలో గుర్తించామని ఈ వ్యాధి ఇప్పటికే వివిధ జాతులలో వ్యాప్తి చెందడం ప్రారంభించిందని, మరొక ప్రాణాంతక వ్యాధికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ వ్యాధికి మనుషుల్లో రోగనిరోధక శక్తి లేదని, ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి ప్రభావాన్ని చూపుతుందని యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 2003 నుండి, H5N1 బర్డ్ ఫ్లూ సోకిన ప్రతి 100 మందిలో 52 మందిని చనిపోయారని, అంటే ఈ వ్యాధి సోకిన వారిలో 50 శాతం మంది చనిపోయే అవకాశం ఉందని తెలిపింది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో మరణాల రేటు 0.1 శాతం నుండి 20 శాతానికి పెరిగింది. ఈ వ్యాధిని వాడుకలో బర్డ్ ఫ్లూ అంటారు. ఈ వైరస్ ఎక్కువగా పక్షులను ప్రభావితం చేస్తుంది. పౌల్ట్రీ వంటి పక్షులను పెంచే పొలాల నుండి H5N1 వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి మానవులకు, ఇతర క్షీరదాలకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి పక్షి రెట్టల ద్వారా..సోకిన పక్షితో ప్రత్యక్ష సంబంధం ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, జలుబు జ్వరం, బాధిత వ్యక్తులలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో సహా వివిధ లక్షణాలు కనిపిస్తాయి.
Discussion about this post