ఇజ్రాయిల్ దళాలు గాజాలో మరో భారీ సొరంగాన్ని గుర్తించి, బాంబులతో పేల్చివేశాయి. దాదాపు 10 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగం దృశ్యాలను ఇజ్రాయెల్ రక్షణ దళం విడుదల చేసింది. అది ఉత్తర, దక్షిణ గాజాను కలుపుతుందని తెలిపింది. ఉత్తర గాజాలోని టర్కిష్ ఆసుపత్రి కింద నుంచి దక్షిణ గాజాలోని ఇస్రా వర్సిటీ వరకు సొరంగం విస్తరించి ఉన్నట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి.
ఇజ్రాయెల్ దళాలు గుర్తించిన భారీ సొరంగంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. హమాస్ మిలిటెంట్లు నిద్రపోవడానికి పడకలు, విద్యుత్ సదుపాయం, నీరు, మరుగుదొడ్లు సహా ఇతర సదుపాయాలున్నాయి. లోపల ఆయుధాలు, మందుగుండు సామగ్రి దాచుకోవడానికి కూడా హమాస్ తగిన ఏర్పాట్లు చేసుకున్నట్లు ఇజ్రాయెల్ దళాలు చెప్పాయి. హమాస్ సభ్యులు, ఆయుధాల తరలింపు కోసం ఈ సొరంగాన్ని వినియోగిస్తున్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది.
Discussion about this post