బరిలో దూకండి.. నన్ను ఓడించండి.. ఆ దమ్మున్న మగవాడినే నేను పెళ్లి చేసుకుంటానంటూ.. పురుషాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఓ మహిళ విసిరిన సవాల్ ఇది. సాధారణ మహిళ అయితే చర్చకు అంతగా ఆస్కారం ఉండేది కాదు. కానీ, ఆ సవాల్ విసిరింది హమీదా బాను. కుస్తీ పోటీల్లో వందల మందిని ఓడించానని తనకు తానుగా ప్రకటించుకుంది హమీదా బాను. కళ్లారా ఆమె పాల్గొన్న పోటీలు చూసి అప్పటి మీడియా పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. భారతదేశంలో తొలి మల్ల యోధురాలిగా హమిదా బాను పేరు చరిత్రకెక్కింది.
Discussion about this post