తెలంగాణ రాజకీయాల్లో ఓటమెరగని నాయకుడు బీ ఆర్ ఎస్ నేత హరీష్ రావు . డైనమిక్ లీడర్ గా ఆయన పేరు గాంచారు. సిద్ధిపేట గడ్డ మీద మామ kcrను మించిన అల్లుడు అనిపించుకున్నారు హరీష్. తెలంగాణలోనే భారీ మెజార్టీ తో గెలిచిన నేతల్లో హరీష్ తొలి నాయకుడు.
తెలంగాణ కోసం జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్ రావు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎవరు సాధించని రీతిలో ఓట్లు సాధించి రికార్డుల మోత మోగించారు. 2010 ఉప ఎన్నికల్లో 95,878 ఓట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి సంచలన విజయం నమోదు చేశారు. సిద్ధిపేటలో ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయాలు నమోదు చేశారు హరీష్ రావు.
సిద్ధిపేట నియోజకవర్గం బీ ఆర్ ఎస్ కు కంచుకోట లాంటిది. 1985లో మొదటిసారి కేసీఆర్ సిద్ధిపేట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. తర్వాత ఆయన 1989, 94, 99 ఎన్నికలతో పాటు 2001, 2004 ఎన్నికల్లోనూ వరుసగా ఆరుసార్లు విజయం సాధించి 20 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఆయన మేనల్లుడు హరీష్ రావు సిద్ధిపేటలో కేసీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.ఆయన 2004 ఉపఎన్నికల నుంచి వరుసగా ఆరు సార్లు ఇక్కడి నుంచి విజయపతాకం ఎగరవేశారు. వరుసగా ఇన్నిసార్లు విజయం సాధించాలంటే కేవలం ప్రజల అభిమానం ఉంటే సరిపోదు. అభివృద్ధి జరగాలి. ఈ విషయంలో హరీష్ రావు ముందంజలో ఉన్నారు.
ముఖ్యంగా సిద్ధిపేట పట్టణం అభివృద్ధిలో మిగతా పట్టణాల కంటే ఎంతో ముందుంది. ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు. అభివృద్ధిలో మోడల్ గా నిలిపారు. జాతీయ స్థాయిలోనూ సిద్ధిపేట మున్సిపాలిటీ అభివృద్ధి, పచ్చదనం, పారిశుధ్యం వంటి విభాగాల్లో అవార్డులను అందుకుంటోంది . ప్రభుత్వం ఏదైనా నిధులు సాధించడంలో హరీష్ రావు సఫలమయ్యారు. ఇటీవలే సిద్ధిపేటకు రైల్ సర్వీసులు కూడా మొదలయ్యాయి. దీంతో హరీష్ రావుకి ఇక్కడ తిరుగులేకుండా పోయింది. అందుకే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఇక్కడి ప్రజలు హరీష్ రావు కు పట్టం కడుతున్నారు.
ఈ నియోజకవర్గంలో 2014 లో కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్ గౌడ్ ను ఓడించి 93,328 మెజారిటీతో విజయం సాధించారు.బీజేపీ తరపున సొప్పదండి విద్యాసాగర్ బరిలోకి దిగగా కేవలం 13303 ఓట్లు వచ్చాయి.ఇక 2018..లో మహాకూటమి అభ్యర్థి మర్రి కంటి భవాని పై 118699.. ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఈ సారి కాంగ్రెస్ తరపున పూజల హరికృష్ణ , బీజేపీ తరపున దూది శ్రీకాంత్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.హరీష్ రావును ఓడించలేకపోయినా గణనీయంగా మెజారిటీని తగ్గించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
Discussion about this post