చిన్నా పెద్ద తేడాలేకుండా రంగులు చల్లుకుంటూ ఆడిపాడే పండుగ హోలీ. వసంత కాలంలో వచ్చే ఈ పండుగను కులాలు, మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు. శీతాకాలం నుంచి వేసవికి మారే వసంత కాలంలో దీనిని జరుపుకుంటారు. అందుకే దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి హోలీ ఆడేవాడని చెప్పుకుంటారు. హోలీ ముందు రోజున హిరణ్య కశ్యపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటించి దహనం చేస్తారు. దీనిని హోలిక దహన్ అని అంటారు. రంగుల గురించి.. అవి ఎన్ని రకాల ఉంటాయి ? మనకి సురక్షితంగా ఉండేవి ఏవి అనే విషయాలు మా 4 sides ప్రతినిధి మహేశ్వరి అందిస్తారు.
Discussion about this post