సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో భాగస్వాములయ్యారు. గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పొన్నం మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరా గాంధీ కల్పించిన గిరిజన రిజర్వేషన్ వల్లనే బంజారాల జీవితాల్లో వెలుగులు నిండాయని గుర్తుచేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో గిరిజనుల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
Discussion about this post