మూక దాడులను నివారించేందుకు కేంద్రం చట్టసవరణ చేసింది. దీని ప్రకారం మూకదాడుల నేరస్తులకు కనిష్టంగా ఏడేళ్లు లేదా జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. బ్రిటీషు సామ్రాజ్యవాద శిక్షస్మృతి బదులుగా భారతీయ న్యాయ సంహిత బిల్లు 2023 ను ప్రవేశ పెట్టామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో చెప్పారు. మూక దాడి, హత్యలకు సంబంధించి నేరస్తులకు ఇచ్చే శిక్షలపై ఇండియన్ పీనల్ కోడ్ లో చర్చించలేదని, దీంతో సెక్షన్ 302 ప్రకారమే శిక్షిస్తున్నారన్నారు.
భారతీయ న్యాయ సంహిత బిల్లు ప్రకారం కులం, జాతి, లింగ, ప్రాంతం, భాష వ్యక్తిగత నమ్మకాల కారణంగా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది కలసి వ్యక్తిని హత్య చేస్తే కనిష్టంగా ఏడేళ్లకు తగ్గకుండా శిక్షపడేలా చేశామన్నారు. నేర తీవ్రతను బట్టి మరణ శిక్ష, లేదా జీవితకాల శిక్ష లేదా ఫైన్ లేదా రెండూ ఉండే విధంగా చట్టాన్ని సవరించారు.
మూకుమ్మడి దాడులను నివారించేందుకు కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు చర్యలు తీసుకోవడంతోపాటు ఎఫ్ ఐఆర్ ప్రాతిపదికగా సంవత్సరాల వారీగా సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు జూలై నెలలో కోరింది. దీంతో కేంద్రం చర్యలు చేపట్టింది.
Discussion about this post