భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. 53 అడుగుల వద్ద నిలకడగా ఉన్న గోదావరి.. ఇవాళ ఉదయం ఒక్క అడుగు తగ్గి 52.4 అడుగులకు చేరుకుంది. దీంతో మూడవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు అధికారులు. పట్టణంలోని అశోక్ నగర్ కొత్త కాలనిలోకి వరద నీరు చేరడంతో సుమారు ముప్పై ఇండ్లు వరద ముంపునకు గురయ్యాయి. ఇవాళ ఉదయం 25 గేట్లను ఎత్తి 43 వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
Discussion about this post