మొక్కల శబ్ధాలు చేస్తాయా?… అవి మీరు ఎప్పుడైనా విన్నారా?.. మొక్కలు, చెట్లు ఆక్రందనలు చేస్తాయా?.. వాటి శబ్ధాలు, ఆక్రందనలు జంతువులు, కీటకాలకు వినిపిస్తాయా?.. చెట్లు, మొక్కలను కూకటి వేళ్లతో పెకలించినప్పుడు.. కాండాలను నరికినప్పుడు ఆవేదనకు గురవుతాయా? ఎస్.. అవుననే అంటున్నాయి కొన్ని పరిశోధనలు…
మొక్కలు, చెట్లు ఎంత ఉపయుక్తమో ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు.. మనుషులకు ప్రాణావాయువు సమర్పిస్తాయి… అసలు మొక్కలు లేనిదే మానవులు జీవించడం కష్టం.. వాటి మనుగడే… మనుషులకు జీవనాధారం. పచ్చదనం లేని ప్రపంచం ఊహించడం చాలా కష్టం. మొక్కలను, చెట్లను మనం ఎంత ఇబ్బంది పెట్టినా అవి మనకు ఉపయుక్తంగానే ఉంటాయి. వాటిని హింసించినా.. లోలోపల బాధపడుతూ.. మనుషులకు సహకరిస్తునే ఉంటాయి ఉంటాయి… కానీ వాటిని మాత్రం మనుషులు ముప్పుతిప్పలు పెడతారు… తమ అవసరాలకు విచ్ఛల విడిగా వాడేసుకుంటారు. కానీ మొక్కలు కూడా బాధపడతాయని, అవి కూడా ఆక్రందనలకు గురవుతాయాంట.. ఇది మేము చెబుతున్న మాట కాదు.. కొన్ని పరిశోధనలు ఈ వివరాలు వెల్లడించాయి.
తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు మొక్కలు కూడా ‘ఆక్రందనలు’ చేస్తాయని పరిశోధకులు తాజాగా గుర్తించారు. అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీల్లో ఉండే ఈ ధ్వనులు చిటికెలు వేసినట్టుగా ఉంటాయని చెబుతున్నారు, అవి మనుషులకు వినిపించవంటున్నారు. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ అంశాలు తాజాగా సెల్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. చెట్లు, మొక్కలను కూకటి వేళ్లతో సహా పెకలించినప్పుడు, లేదా వాటి కాండాన్ని మధ్యలో నరికినప్పుడు మొక్కలు ఈ ‘ఆక్రందనలు’ చేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Discussion about this post