ఈ శబ్దాలు ఒత్తిడిని తగ్గించి విశ్రాంతిని కలిగిస్తాయట. టిబెటన్ సింగింగ్ బౌల్స్ ను రాగి, టిన్, జింక్, ఇనుము, వెండి మరియు బంగారపు లోహాలతో తయారు చేస్తారట. ఈ బౌల్పై చెక్కతో రుద్దినపుడు చక్కని శబ్దాలు వస్తాయి. వీటికి వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ప్రతి గిన్నెకు ఒక ప్రత్యేకమైన ప్రకంపనం ఉందని నమ్ముతారు. ఈ కంపనాల ద్వారానే హీలింగ్ ఎనర్జీ విడుదల అవుతుందని చెబుతారు .
టిబెటన్లు వారి ఆధ్యాత్మిక, ధ్యాన అభ్యాసాలలో ఈ బౌల్స్ ఉపయోగిస్తారు. ఈ శబ్దాలు పర్యావరణాన్ని కూడా శుద్ధి చేస్తాయని వారు నమ్ముతారట. అంతేకాదు ఈ వైబ్రేషన్లను వైద్య చికిత్సగా కూడా ఉపయోగిస్తారట. ఈ బౌల్స్ పై చేసే శబ్దం వినడం ద్వారా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుందట. వ్యక్తులు ధ్యాన అభ్యాసాలలో కూడా ఇది ఉపయోగపడుతుందట. ధ్యానంలోకి వెళ్లడం ఏకాగ్రతతో కొనసాగించడం దీని వల్ల సాధ్యమవుతుందట. నిద్రలేమితో బాధపడేవారికి సింగింగ్ బౌల్ శబ్దాలు వినడం వల్ల మెరుగైన నిద్ర పడుతుందట.
సింగింగ్ బౌల్పై శబ్దాలు చేయడానికి పెద్దగా శిక్షణ అవసరం లేదట. గిన్నెను మేలట్తో (చెక్కతో చేసిన వస్తువు) సున్నితంగా రుద్దడమే. ఇవి శరీరంలో ఒత్తిడికి సంబంధించిన వ్యాధులను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయట. ఈ బౌల్స్ కాస్త ఖరీదైనవే.. ఇవి ఆన్ లైన్లో కొనుగోలు చేసేవారికి అందుబాటులో ఉంటాయట. ఈ బౌల్కి బుద్ధ బౌల్, హిమాలయన్ బౌల్, రిన్ గాంగ్, బౌల్ గాంగ్, కప్ గాంగ్ అనే పార్లు కూడా ఉన్నాయి. అయితే గర్భిణీ స్త్రీలు వైద్యుల అనుమతి లేకుండా ఈ సింగింగ్ బౌల్ శబ్దాలు వినకూడదని చెబుతారు.ఏది ఏమైనా వీటి గురించి పూర్తి వివరాలు తీసుకొని ఉపయోగించడం మంచిది .
Discussion about this post