శివనాడార్ వ్యా పార, పారిశ్రామిక రంగాల్లోనే కాదు.. దాతృత్వంలోనూ నంబర్ 1 గా దూసుకుపోతున్నారు. ఈ నాటి యువతరానికి ఆయన స్ఫూర్తి ప్రదాత అంటే ఏమాత్రం అతిశయోక్తికాదు. దేశంలోని మిగతా పారిశ్రామిక వేత్తలతో పోలిస్తే గత కొన్ని ఏళ్లుగా ఆయన విరాళాలు ఇవ్వడంలో ముందంజలో ఉన్నారు.
శివ్ నాడార్, ఆయన కుటుంబ సభ్యులు 2022-23 ఆర్థిక సంవత్సరం రోజుకు రూ.5.6 కోట్ల చొప్పున విరాళాలు ఇచ్చారు. 2023 మార్చి తో ముగిసిన ఏడాదికిగాను ఎడెల్‌గీవ్ హురున్ ఇండియా ప్రకటించిన ఫిలంత్రఫీ నివేదిక లో ఈ విషయం వెల్లడి అయింది.
ఆర్ట్స్, కల్చర్, హెరిటేజ్,విద్యా రంగాలకు శివ్ నాడార్, ఆయన కుటుంబం నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఈ విరాళాలు 2021-22తో పోల్చితే ఈసారి 76 శాతం పెరగడం విశేషం
శివ్ నాడార్ భారతదేశంలోని అతిపెద్ద ఇన్ఫోటెక్ కంపెనీ హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు. చైర్మన్ గా కొన్నాళ్ళు చేసి ప్రస్తుతం అడ్వైజర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమార్తె రోష్ని నాడార్ చైర్మన్ గా ప్రసుతం కంపెనీ ని నడుపుతున్నారు. ఫోర్బ్స్ భారతీయ బిలియనీర్ల జాబితాలో శివ నాడార్ ఉ న్నారు.
తమిళనాడులోని టుటుకోరిన్ జిల్లా త్రిచెందూర్‌లోని మూలైపోజి గ్రామం లో శివసుబ్రమణ్య0 వామసుందరీ దంపతులకు జన్మించిన శివనాడార్ అంచెలంచెలుగా ఎదిగారు. బాల్యం నుంచే ఆయన చురుగ్గా ఉండేవారు. స్కూల్ చదువుల్లోనూ నంబర్ 1 .. మధురైలోని అమెరికన్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి . PSG కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్.. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని పూర్తి చేశారు.
శివ్ నాడార్ 1968లో ఢిల్లీకి వెళ్లారు. అక్కడ DCM లిమిటెడ్‌లో ఇంజనీర్‌గా పనిచేశారు. అయితే శివ్‌నాడార్ ను ఏదో అసంతృప్తి వెంటాడేది. సొంతంగా ఏదైనా చేయాలనే తలంపు కలిగేది. కొన్నాళ్ల తర్వాత తన ఆరుగురు సహచరులతో కలిసి కాపీయర్స్ వంటి కార్యాలయ ఉత్పత్తులను తయారు చేసే సంస్థను ప్రారంభించాడు.1978 లో IBM భారతదేశం నుండి నిష్క్రమించినసమయంలో. శివ నాడార్ దృష్టి కంప్యూటర్స్ రంగంపై పడింది.IBM లేని లోటును భర్తీ చేయాలనుకున్నారు. ఆ ఆలోచనే హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ ఆవిర్భావానికి బీజం వేసింది. ఎంతో కృషి చేశారు ఫలితంగా 1982లో HCL తన మొదటి కంప్యూటర్‌ను విడుదల చేసింది. HCL తన ఆదాయంలో 80 శాతం కంప్యూటర్లు. కార్యాలయ పరికరాల నుండి పొందుతోంది. ఆ క్రమంలోనే హెచ్‌సిఎల్ గ్లోబల్‌గా విస్తరించింది. దాని సింగపూర్ అనుబంధ సంస్థ, ఫార్ ఈస్ట్ కంప్యూటర్స్, ఇమేజింగ్ టెక్నాలజీలో పురోగతిని సాధించింది.
ప్రస్తుతం 2. 25, లక్షల మంది ఉద్యోగులు HCL గ్రూప్ కంపెనీలలో పనిచేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో HCL కార్యాలయాలు, డెలివరీ కేంద్రాలు .. ఇన్నోవేషన్ లేబొరేటరీలు ఉన్నాయి. చిన్నసంస్థగా HCL ప్రస్థానం మొదలై .. అతి పెద్ద సంస్థగా ఎదిగింది. అభి వృద్ధిని సాధించేందుకు HCL వినూత్న పద్ధతులను అవలంబించింది. U.S.లో సాఫ్ట్‌వేర్ అనుబంధ సంస్థ, HCL అమెరికా, గ్లోబల్ టైమ్ జోన్ ప్రయోజనాన్ని పొందుతూ భారీ ఆదాయాన్ని సంపాదించింది. ప్రతిరోజు ఉదయం, కంపెనీ చెన్నై కార్యాలయానికి US నుండి సాఫ్ట్‌వేర్ అసైన్‌మెంట్‌లు అందేవి. భారతీయ ఇంజనీర్ల బృందం ఆ అసైన్మెంట్లను పూర్తి చేసి సాయంత్రానికి తిప్పి పంపేవారు. అమెరికన్ ఉద్యోగుల కంటే చాలా తక్కువ జీతాలతో ఇండియా స్టాఫ్ పనిచేసేవారు. దీని మూలంగా కంపెనీ ఆదాయం బాగా పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ తో ముగిసిన 12 నెలల కాలానికి 12… 9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కంపెనీ ఆర్జించింది.
ఇక విద్యా రంగం పట్ల ఉన్న ఆసక్తితో 1996లో నాడార్ తన తండ్రి శివసుబ్రమణ్య నాడార్ పేరు మీద చెన్నైలో SSN కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ని స్థాపించారు. .ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో పూర్తి ఉచిత రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారు. శివ్ నాడార్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అతని భార్య కిరణ్ నాడార్ పేరు మీద మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ ని స్థాపించారు.
విద్య ..పారిశ్రామిక రంగాల్లో శివనాడార్ చేసిన కృషి కి గాను 1995లో ఆయన డేటాక్వెస్ట్ IT మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ఎంపిక అయ్యారు. 2005లో CNBC బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు పొందారు. 2006లో ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ గౌ రవ ఫెలోషిప్ పొందారు. 2008లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2009లో ఆసియా పసిఫిక్‌లో దాతృత్వానికి సంబంధించిన ఫోర్బ్స్ 48 మంది హీరోలలో ఒకరుగా నిలిచారు. 2010లో డేటాక్వెస్ట్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. 2022 లో టెక్నాలజీ .. విద్యారంగంలో .. దాతృత్వరంగంలో సేవలకు గాను USISPF లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ను పొందారు.
Discussion about this post