కామారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల తీరు పలు విమర్శలకు తావిస్తుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఒక ప్రభుత్వ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులపై లైంగిక వేధింపులు పాల్పడ్డాడు. కాగా పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా బీర్కూర్ తిమ్మాపూర్ పాఠశాలలో పుస్తకాలు మాయం కావడం, అలాగే బొమ్మందేవ్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి తండ్రి పై ఉపాధ్యాయుడు చేయి చేసుకోవడం వంటి ఘటన చోటుచేసుకుంటున్నాయి.
Discussion about this post