ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవె న్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. కోర్టు అనుమతితో రెండు విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంలో మార్చి 26న తిహాడ్ జైలుకు తరలించారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగి కవిత తిహాడ్ జైలులో ఉండగానే ఈ నెల 11న అరెస్టు చేసింది. ఈడీ కేసులో తన కుమారుడికి పరీక్షలున్నాయని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కేసులో బెయిల్ కోసం మార్చి 26న, సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 15న న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని.. జైల్లో ఉంటే అవి మరింత పెరిగి ఇబ్బందిగా మారుతుందని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లలో కవిత విజ్ఞప్తి చేశారు. ఈ రెండు బెయిల్ పిటిషన్లపై సోమవారమే విచారణ జరగనుంది.
కాంగ్రెస్ పై మరోసారి విమర్శలు గుప్పించిన మోడీ
ముస్లింలకు ప్రజల ఆస్తులు దోచిపెడతారన్న ప్రధాని
———- హస్తంపై కన్నెర్ర
మోడీ హయంలో ప్రజలకు రైలు శిక్ష
జనరల్ బోగీల సంఖ్య పెంచాలని రాహుల్ డిమాండ్
———- టార్గెట్ పీఎం
కాంగ్రెస్ పాలనలోనే దేశంలో ఘర్షణలు
మోడీ వచ్చాక నక్సలిజాన్ని రూపుమాపామన్న అమిత్ షా
———- విమర్శనాస్త్రాలు
నేడు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ
కీలక తీర్పు వెలువడే అవకాశం
——– దొరికేనా?
Discussion about this post