తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి. వీటికారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేశాయి. 130 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో 0.5, ఏపీలో 0.9 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా వీటికి వాతావరణ మార్పులే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వడగాలుల నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ, రేపు ఎనిమిది జిల్లాలకు.. ఎల్లుండి 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సత్యసాయి, కడప, నెల్లూరు, అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, పల్నాడు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని కోరింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని.. తప్పనిసరి అయితే టోపీ, గొడుగు వంటివి ధరించాలంటున్నారు. కాగా, వడగాలుల నేపథ్యంలో వృద్ధులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ 37°C
రామగుండం 39°C
కరీంనగర్ 38°C
విశాఖపట్నం 32°C
విజయవాడ 36°C
తిరుపతి 36°C
కడప 38°C
కర్నూలు 39°C
Discussion about this post