బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణశర్మ మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలో వడగళ్ల వాన వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని శర్మ కోరారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు పంట నష్టాలను అంచనా వేస్తున్నారని కలెక్టర్కు నివేదికలు పంపుతామని చిన్నకోడూరు ఎమ్మార్వో జయలక్ష్మి తెలిపారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వానకు వరి, కాకర తోట, మామిడి తోటలు దెబ్బతిన్నాయని ఆర్టికల్చర్ అధికారి భాస్కర్ తెలిపారు.
చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామానికి చెందిన రైతు దత్తాత్రి మాట్లాడుతూ వడగళ్ల వానకు పందిరి సాగు విధానంలో తనకున్న 3 ఎకరాల కాకర బీర తోట పూర్తిగా దెబ్బతింది.
Discussion about this post