ఆంధ్రప్రదేశ్‌లో బంగారాన్ని వెలికితీస్తున్నారా.. బంగారు గనులు ఎక్కడున్నాయి… ఎప్పుడు వెలికితీస్తారు..ఈ పనులు మొదలైతే ఎంత బంగారం బయటకు తీస్తారు… ఎప్పటి నుంచి బంగారం ఉత్పత్తిని మొదలెడతారు… త్వరలోనే ఏపీ పసిడి రాష్ట్రంగా మారుతుందా అనే స్టోరీ మీ కోసం..
ఏపీలో గోల్డ్ సరఫరాకు మూహుర్తం ఫిక్స్ చేశారు. త్వరలోనే బంగారం తవ్వకాలకు శ్రీకారం చుడుతున్నారు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారు గనులు బయట పడ్డాయి. ఎర్ర నేలల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. అక్కడ ఈ ఏడాది చివరి నాటికల్లా ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. దాదాపుగా 1500 ఎకరాల్లో పసిడి నిలవలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ స్థలంలో తవ్వకాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇక్కడ బంగారం కోసం తవ్వకాలు జరిపేది ప్రైవేటు రంగం వారు… ఇప్పటి వరకు ఇండియాలో ప్రైవేటు వారు బంగారాన్ని వెలికి తియ్యలేదు… కానీ దేశ చరిత్రలోనే మొదటి సారిగా బంగారాన్ని ప్రైవేటు రంగం వారు బయటకు తీస్తున్నారు. దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెని అనుబంధ సంస్థ జెమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఈ పనులు చేపడుతోంది. ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు దాదాపు 60% పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రయోగాత్మక కార్యకలాపాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ ప్లాంట్ పనులు మొదలైతే చాలు… ప్రతి ఏటా 750 కిలోల బంగారం వెలికి తీసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ గనిపై రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు దక్కన్ గోల్డ్ మైన్స్ గతంలో వెల్లడించింది.
ఏపీలో గోల్డ్ సరఫరాకు మూహుర్తం ఫిక్స్
త్వరలోనే బంగారం తవ్వకాలకు శ్రీకారం
కర్నూలు జిల్లా తుగ్గలి జొన్నగిరిలో బంగారు గనులు
1500 ఎకరాల్లో పసిడి నిలువలు
ప్రతి ఏడాది 750 కిలోల బంగారం ఉత్పత్తి
ఏపీలో కేవలం కర్నూలు జిల్లాలోనే కాకుండా… చిత్తూరు, అనంతపురంలో కూడా బంగారు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ కూడా బంగారు గనుల కోసం అన్వేషన్ మొదలెట్టారు. ఇప్పటికే వాటిని గుర్తించి.. అభివృద్ధి చేసే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. చిత్తూరు, అనంతలో పసిడి గనులను తవ్వేందుకు సర్కారు సిద్ధమైంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్ ఆ పనులు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. గనులు తవ్వేందుకు ఏపీ ప్రభుత్వాన్ని ఎన్ఎండీసీ కోరింది.. ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. జొన్నగిరి గనితో పాటు ఈ జిల్లాల్లోనూ బంగారం ఉత్పత్తి ప్రారంభమైతే ఆంధ్రప్రదేశ్‌కు బంగారం గనుల రాష్ట్రంగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది
Discussion about this post