తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు రోజుల వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఇప్పుడు మరఠ్వాడా నుండి అంతర్గత కర్ణాటక, తమిళనాడు వరకు విస్తరించింది. ఫలితంగా, మార్చి 20 వరకు మధ్య తెలంగాణ, కోస్తాంధ్ర ప్రదేశ్,యానాంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలు దీని ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంకా, జమ్మూ , కాశ్మీర్, లడఖ్‌లలో కూడా మార్చి 20 , 21 తేదీలలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
Discussion about this post