ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాహనాల విస్తృత తనిఖీలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలకు చాలాన్లు వేశారు. ఏసీపీ శ్రీనివాసరావుతో పాటు ఉప్పల్ ట్రాఫిక్ ఎస్ హెచ్ ఓ లక్ష్మి మాధవి కూడా విస్తృత తనిఖీలు నిర్వహించారు. సుమారు 95 ద్విచక్ర వాహనాలను, ఐదు కార్లను పట్టుకొని చాలాన్లు వేసినట్లు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఇన్సూరెన్స్, లైసెన్స్, సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పక కలిగి ఉండాలని ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని సూచించారు. నెంబర్ ప్లేట్ మార్పిడి చేసి నడిపిస్తున్నటువంటి వాహనాలపై కఠిన చర్యలు ఉంటాయని ఏసీపీ తెలిపారు.
Discussion about this post