జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లోక్‌సభ ఎన్నికల్లో దమ్కా ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి జార్ఖండ్ ముక్తి మోర్చా తెర దించింది. దమ్కా లోక్‌సభ స్థానానికి శికరిపాడ ఎమ్మెల్యే నలిన్ సోరెన్‌ను జేఎంఎం నామినేట్ చేసింది. అదే విధంగా గిరిధిహ్ ఎంపీ స్థానానికి తుండి ఎమ్మెల్యే మథుర ప్రసాద్‌ను బరిలో దింపింది. దమ్కా నుంచి నలిన్ సోరెన్‌ను బరిలో ఉంచడంతో హేమంత్ సోరెన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టమైంది. ఇక దమ్కా నియోజకవర్గం నుంచి హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్‌ను బీజేపీ బరిలో దింపింది. సిట్టింగ్ ఎంపీ సునీల్ సోరెన్నే దమ్కా నుంచి పోటీ చేస్తారని మార్చి 2వ తేదీన బీజేపీ ప్రకటించింది. కానీ అనుహ్యంగా సీతా సోరెన్‌ను బీజేపీలో చేర్చుకుని, ఆమెకు దమ్కా నుంచి అవకాశం కల్పించారు.
Discussion about this post