ఆంధ్రప్రదేశ్ లో భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. విపరీతమైన ఉక్కపోత, చెమటతో ఇప్పటినుంచే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాలలోని 31 మండలాలలో వడగాలులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే మే లో ఎలా ఉండాలో అని ప్రజలు బంబేలెత్తుతున్నారు.
ఏపీలో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం 2.6 డిగ్రీల నుంచి 2.9 డిగ్రీల వరకు రోజువారీ ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతే కాదు రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది.ఎండ తీవ్రతతో పాటు, వడగాల్పులు ప్రభావం చూపుతోంది. ఈ మండలాల్లో ప్రజలు ఎండ సమయంలో బయటికి వెళ్లకుండా ఉంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
వడదెబ్బ తగిలే అవకాశం ఉన్న కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వీలైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని చెబుతున్నారు. ముసలివారు, చిన్నపిల్లలు బయటకు రాకుండా ఉంటే మంచిదంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల 42 డిగ్రీలు, కర్నూలులో 41.9, కడప 41.2 అనంతపురం జిల్లాలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Discussion about this post