ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40 నుండి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరన శాఖ అధికారాలు హెచ్చరికలు జారి చేశారు. మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం, సతుపల్లిలోని బొగ్గు గనుల ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సింగరేణి కార్మికులు అనేక ఇబ్భందులు పడుతున్నారు. వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Discussion about this post