రుణాల పంపిణీని బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రజలకు, రైతులకు విస్తృత రుణ పంపిణీకి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి హాజరయ్యారు. పట్టు గూళ్ల పెంపకం రైతులకు కోటి 83లక్షల 41 వేలరూపాయల ప్రోత్సాహక ఇన్సెంటివ్ను అందచేశారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ… వ్యవసాయం, హౌసింగ్, విద్య రుణాలకు బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. రైతులు, నిరుద్యోగులకు రుణాల ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదని అన్నారు. వ్యాపారంలో విఫలమైన ఈము రైతులకు రుణాల చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ చేయాలని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు అధిక రుణాలు ఇవ్వాలని, రానున్న ఐదు సంవత్సరాల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు లక్ష కోట్ల రుణాలు ఇస్తామని అన్నారు. మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల డబ్బులను బ్యాంకర్లకు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు.
Discussion about this post