మహారాష్ట్ర శంబాజీపూర్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 500 నోటుపై రాముడి ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అమెరికా, థాయ్ లాండ్, యూరప్, 80శాతం ముస్లిం లు ఉన్న ఇండోనేషియా దేశాలలో కరెన్సీ పై హిందూ దేవుళ్ళను ముద్రించారని తెలిపారు. అయోధ్య లో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో 5 వందల నోటుపై శ్రీరాముడి ఫొటో ముద్రించాలని అన్నారు. ఈ డిమాండ్ నా ఒక్కడిదే కాదని దేశంలోని వంద కోట్ల మంది హిందువుల డిమాండ్ అని తెలిపారు. మరోవైపు దేశంలో వక్ఫ్ బోర్డు పేరుతో ఉన్న భూములు రిలీజ్ చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. దేశ విభజన సమయంలో దేశ ప్రజలను హత్య చేసిన వారి ఆస్తులు కాపాడేందుకు నెహ్రూ వక్ఫ్ చట్టం తెచ్చారని రాజాసింగ్ అన్నారు. మహారాష్ట్ర లోనే పది లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు పేరుతో ఉంది. 2009 వరకు 4లక్షల ఎకరాలు మాత్రమే ఉన్న భూమి ఉండేదని రాజాసింగ్ అన్నారు.
Discussion about this post