కేవలం తన హావభావాలతోనే ప్రేక్షకుల చిరునవ్వుల విరిజల్లులు కురిపించే విఖ్యాత దర్శకుడు, విలక్షణ నటుడు చార్లీ చాప్లిన్ జన్మించి నేటితో సరిగ్గా 123 సంవత్సరాలు. ఎన్ని తరాలు మారినా, తరగనని నవ్వుల సంపదను పంచిన ఈయన మూకీ చిత్రాలు చూసిన వారెవ్వరూ ఆయనను మర్చిపోలేరు. చార్లీ చాప్లిన్ అసలు పేరు చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్. 1889 ఏప్రిల్ నెల 16వ తేదీన లండన్‌లో జన్మించాడు. అతని తల్లిదండ్రులు సంగీత ప్రదర్శనకారులు. చాప్లిన్ కూడా తన తల్లిదండ్రుల అడుగుజాడల్లో ఐదేళ్ల వయసులో సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించి…17 సంవత్సరాల వయస్సులో వృత్తిపరమైన విదూషకుడిగా మారాడు.
1912లో…అప్పుడప్పుడే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న సమయంలో…చాప్లిన్ అమెరికాకు వెళ్ళాడు. 1914లో హాలీవుడ్లో నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. కీస్టోన్ స్టూడియోస్ తన స్లాప్స్టిక్ కామెడీల కోసం చాప్లిన్ నియమించుకోగా…. వారి కోసం చాప్లిన్ 35 లఘు చిత్రాలలో నటించారు. ఆయన లిటిల్ ట్రాంప్ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తరువాత కొన్ని మూకీ క్లాసిక్‌లలో చిరస్మరణీయమైన ప్రదర్శనలు ఇచ్చాడు. ది కిడ్, ది గోల్డ్ రష్, ది కాంపియన్, షోల్డర్ ఆర్మ్స్ అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 1920లలో టాకీ చిత్రాలు రావడంతో ..ఇక్కడ కూడా చాప్లిన్ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. సిటీ లైట్స్, మోడరన్ టైమ్స్, ది గ్రేట్ డిక్టేటర్ అతని ఉత్తమ చిత్రాలు కాగా…ఈ చిత్రాలను చాప్లిన్ రాశారు. చాప్లిన్ 1951లో అమెరికా నుంచి యూరప్‌కు వెళ్లి…1952లో బ్రిటీష్ పౌరసత్వాన్ని పొందాడు. అతనికి ఉన్న కమ్యూనిస్ట్ సానుభూతితో అమెరికాలోకి ప్రవేశం లేకపోవడంతో…స్విట్జర్లాండ్ వెళ్లి…1977లో అక్కడే మరణించాడు. 1978లో అతని శరీరం స్మశానవాటిక నుంచి దొంగలించబడగా… ఇప్పటివరకు దాన్ని కనుక్కోలేకపోయారు..మెడియన్‌గా సినీ ప్రపంచంలో చాప్లిన్కున్నంత పాపులారిటీని ఏ నటుడూ సంపాదించుకోలేదు.
Discussion about this post